ముంబై: ప్రపంచంలో తీవ్రమైన ఆర్థికమాంద్య పరిస్థితులు వచ్చేశాయన్న ఐఎంఎఫ్ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పుంజుకుంటున్నాయి. దీర్ఘకాలిక మాంద్యం ఆందోళనలతో అంతర్జాతీయంగా బంగారు ధరలు లాభపడ్డాయి. దీంతో దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్ లో గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ మార్చి 30 న స్వల్పంగా 0.02 శాతం లాభపడిన పది గ్రాముల పుత్తడి ధర రూ. 43,580 వద్ద వుంది. అయితే జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.6 శాతం పడి రూ. 43,302 కు చేరుకుంది. ఇదే బాటలో పయనించిన వెండి ధర (మే ఫ్యూచర్స్) కిలోకు 3 శాతం క్షీణించింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 39,758 వద్ద కొనసాగుతోంది.
తీవ్ర ఆర్థికమాంద్యం, బంగారం కొనొచ్చా?